ఈ యూనివర్శిటీలు అన్నీ బోగస్ ..జాగ్రత్త

ఈ రోజులలో బోగస్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చి విద్యార్థులను వలలో వేసుకుని మోసం చేస్తున్నాయి. బోగస్ విద్యాసంస్థలలో చదువుతోన్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. యూనివర్శిటీ గ్రాంట్ల కమిషన్ (యూజీసీ) దేశవ్యాప్తంగా ఇప్పటికే 23 బోగస్ యూనివర్శిటీలున్నాయని ప్రకటించింది. ఈ యూనివర్శిటీలకు ఎలాంటి అనుమతులు లేవని అయినప్పటికీ మేనేజి మెంట్లు వాటిని నడుపుతున్నాయని యూజీసీ పేర్కొ న్నది. ఆ యూనివర్శిటీ చదువులకు గుర్తింపు లేదని ప్రకటించింది. ఇలాంటి యూనివర్శిటీ డిగ్రీలకు గుర్తింపులు లేవని, రిక్రూట్మెంట్లకు ఈ డిగ్రీలు దోహదపడవని, పదోన్నతులకు కూడా ఉపయోగ పడవని స్పష్టం చేసింది. బోగస్ యూనివర్శిటీలు ఎక్కువగా ఉత్తరాదిన ఉన్నాయి. దక్షిణాదిన కూడా ఈ రకం యూనివర్శిటీలు పుట్టుకొస్తున్నాయి. నియమ నిబంధనలకు లోబడి కార్యకలా పాలు సాగించని 22 భారత యూనివర్శిటీలను తప్పుడు వర్శిటీలుగా ప్రకటిస్తూ, యూజీసీ (యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్) ఓ ప్రకటన వెలువరించింది. ఈ వర్శిటీల్లో విద్యా ర్థులు చేరవద్దని, ఇవన్నీ స్వయం ప్రకటితాలని, వీటి డిగ్రీ లకు గుర్తింపు ఉండదని తెలిపింది. యూజీసీ వెల్లడించిన ఫేక్ వర్శిటీలివి. వాటి లిస్ట్ మీకు ఇక్కడ ఇస్తున్నాం.